Ayodhya Live Streaming: అయోధ్య రాములవారి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమాన్ని లైవ్‌లో చూసేందుకు మల్టీఫ్లెక్స్ సినిమా థియేటర్లు ముందుకువచ్చాయి. అయోధ్యలో జరిగే వేడుకను సినిమా స్క్రీన్‌పై ప్రదర్శించనున్నాయి. అయితే ఆ వేడుకను వీక్షించేందుకు థియేటర్లు టికెట్‌ కేటాయించాయి. 100 రూపాయలు చెల్లించి థియేటర్లలో ఎంచక్కా రాములోరి దివ్య వేడుకను చూసేయవచ్చు. ఈ మేరకు పీవీఆర్‌ నిర్వాహకులు ఓ ప్రకటన జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యావత్‌ హిందూ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కొన్ని గంటలే మిగిలి ఉంది. సోమవారం జరిగే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా దేశ విదేశాల్లోని క్రీడా, సినీ, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలిరానున్నారు. ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు.


కోట్లాది మంది ప్రజలు అయోధ్యకు వెళ్లాలని భావించగా ఆలయ ట్రస్ట్‌ మాత్రం భక్తులు ఎవరూ రావొద్దని సూచించింది. ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం తర్వాత భక్తులు రావొచ్చని పేర్కొంది. ఈ ప్రకటనతో భక్తజనులు నిరాశ చెందారు. రాములోరి పండుగను నేరుగా చూసే అవకాశం లేకున్నా వివిధ మాధ్యమాల్లో చూడాలని ప్రజలు భావిస్తున్నారు. అలాంటి వారికోసమే పీవీఆర్‌ సంస్థలు ప్రత్యక్ష ప్రసారం అవకాశం కల్పించింది. సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా అయోధ్య రాముడి పండగను చూసే అవకాశాన్ని ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థలు పీవీఆర్‌, ఐనాక్స్‌ కల్పిస్తున్నాయి.


దేశంలోని 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య రాముడి పండగను ప్రత్యక్ష ప్రసారం చేసందుకు పీవీఆర్‌, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. ఈ ప్రత్యక్ష ప్రసారం కోసం ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో పీవీఆర్‌, ఐనాక్స్‌ ఒప్పందం చేసుకున్నాయని సమాచారం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బిగ్‌ స్క్రీన్‌పై ఈ మహాక్రతువును వీక్షించవచ్చని ఆ సంస్థలు ప్రకటించాయి. దీనికోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంచినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. ఆరోజు సినిమాలు పక్కనపెట్టేసి అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవం ప్రత్యక్షప్రసారం చేయనుండడంతో భక్తులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.  గతంలో ఎన్నడూ ఈ విధంగా ఒక వేడుకకు థియేటర్లను వినియోగించిన దాఖలాలు లేవు. మొదటిసారి ప్రజల మనోభావాలకు తగ్గట్టు సినిమా సంస్థలు ఇలా ఏర్పాటుచేయడం పలువురు అభినందిస్తున్నారు. అయితే ఈ పవిత్ర కార్యక్రమానికి కూడా రుసుము చెల్లించాలనే నిబంధన పెట్టడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


అయోధ్య వేడుకను కూడా మల్టీప్లెక్స్‌ నిర్వాహకులు వ్యాపారం చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. భక్తుల మనోభావాలతో కూడా థియేటర్‌ నిర్వాహకులు వ్యాపారం చేసుకుంటున్నాయని మండిపడుతున్నారు. భక్తిభావం ఉంటే.. రాముడి పట్ల ప్రేమతో ఉచిత ప్రదర్శన ఏర్పాట్లు చేయాల్సి ఉందని కొందరు భక్తులు చెబుతున్నారు. అలా కాకుండా సినిమా ప్రదర్శన మాదిరి అయోధ్య ప్రసారానికి కూడా డబ్బులు వసూల్‌ చేస్తుండడం సరికాదని పేర్కొంటున్నారు.


కాగా, ఈ చారిత్రక కార్యక్రమానికి టికెట్‌ ధర పెట్టడంపై పీవీఆర్‌ ఐనాక్స్‌ సంస్థ ప్రతినిధి వివరణ ఇచ్చారు. 'ఇది సినిమా టికెట్ ధర మాత్రమే కాదు. టికెట్‌లో శీతలపానీయాలు, పాప్‌కార్న్ కాంబో కూడా ఉంటుంది. గతంలో పీవీఆర్‌, ఐనాక్స్‌ లు వన్డే ప్రపంచ కప్‌ మ్యాచల్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఇదొక చారిత్రక ఘట్టం. అందుకే పెద్ద తెరపై చూసేందుకు అయోధ్య రాముడి ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని పీవీఆర్ ఐనాక్స్ కో-సీఈవో గౌతం దత్తా తెలిపారు.


అయోధ్య ప్రత్యక్షప్రసార వివరాలు

మొత్తం థియేటర్లు: 175
తేదీ, సమయం: జనవరి 22న మధ్యాహ్నం 12.15 గంటలకు నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు
టికెట్‌ ధర: వంద రూపాయలు (టికెట్‌తోపాటు శీతలపానీయాలు, పాప్‌కార్న్‌ కూడా)
ఎక్కడ తీసుకోవాలి: ఆఫ్‌లైన్‌/ ఆన్‌లైన్‌

Also Read Sports Stars to Ayodhya: అయోధ్య ఉత్సవానికి తరలిరానున్న క్రీడా తారలు.. ఎవరెవరంటే..?

Also Read Ayodhya Pran Pratishtha: గుడిలో బండలు తుడిచిన కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook